Bill Gates Biography in Telugu | Inspiring Story of Bill Gates in Telugu.

 Bill Gates Biography in Telugu | Inspiring Story of Bill Gates in Telugu.

Bill Gates Biography in Telugu | Inspiring Story of Bill Gates in Telugu.


బిల్ గేట్స్ 1955 అక్టోబర్ 28న అమెరికాలో సిఆర్టి నగరంలో జన్మించాడు చిన్నప్పటి నుండి బిల్ గేట్స్ కి లెక్కలు అన్నా కంప్యూటర్ అన్నా చాలా ఇష్టం.

బిల్ గేట్స్ 13 ఏళ్ల వయసున్నప్పుడు గేమ్ కి ప్రోగ్రాం రాశాడు. బిల్ గేట్స్ హైస్కూల్లో ఉన్నప్పుడు కంప్యూటర్స్ ని హ్యాక్ చేశాడు.బిల్ గేట్స్ ఏ క్లాసు లో అయితే అందమైన అమ్మాయిలు ఉన్నారు ఆ క్లాసులోకి తన పేరుని మార్చుకునే వాడు.అలాగే అందమైన అమ్మాయిల పక్కన తన పేరు వచ్చేలా రోల్ నెంబర్స్ కూడా మార్చే వాడు.బిల్ గేట్స్ కి తనపై తరగతికి చెందిన పాల్ అలెన్ స్నేహం కుదిరింది. అతనికి కూడా కంప్యూటర్ అంటే చాలా ఇష్టం.ఇద్దరికీ ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు వారు ఎక్కువశాతం కంప్యూటర్ మీద గడుపుతారు.

బిల్ గేట్స్ వల్ల తల్లిదండ్రులకు బిల్ గేట్స్ లాయర్ చేయాలని కోరిక ఉంది.ఇక బిల్ గేట్స్ హార్వర్డ్ యూనివర్సిటీ లో కి వెళ్ళాడు. ఒకరోజు బిల్ గేట్స్ అనుకోకుండా Popular Electronics అనే మ్యాగజైన్ చూశారు.దాన్ని కవర్ పేజీ మీద Altair 8800 అనే ఒక ఒక కంప్యూటర్ గురించి ప్రకటించబడింది. అయితే ఆ కంప్యూటర్ రన్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కోసం ఆ కంపెనీ ఎదురు చూస్తోందని ఆయన బిల్ గేట్స్ కి తెలిసింది. బిల్ గేట్స్ ఇంకా తన ఫ్రెండ్ కి ఇదే కరెక్ట్ టైం అనిపించింది.

Altair కంపెనీ కలిసి ఆ సాఫ్ట్వేర్ మేము ఇస్తామని చెప్పారు.దాని కోసం ఇద్దరు కలిసి హార్వర్డ్ యూనివర్సిటీ లో చాలా కష్టపడ్డారు.పగలు రాత్రి కష్టపడి చివరికి దాన్ని తయారు చేశారు.ఆ తర్వాత ఈ Altair కంప్యూటర్ చాలా ఫేమస్ అయ్యాయి.ఆ తర్వాత ఇద్దరి స్నేహితులకి మంచి పేరు వచ్చింది. అప్పుడే ఇద్దరూ కలిసి 1975లో మైక్రోసాఫ్ట్ కంపెనీ స్టార్ట్ చేశారు. అప్పటికే మన బిల్ గేట్స్ వయస్సు 19 సంవత్సరాలు.

ఆ రోజులో ఎక్కువ కంప్యూటర్లను అమ్మే ఐబీఎం కంపెనీ తాము విడుదల చేయబోయే పర్సనల్ కంప్యూటర్ కి ఆపరేటింగ్ సిస్టం కావాలని బిల్ గేట్స్ కోరింది. దాని కోసం బిల్ గేట్స్ అప్పటికి ఉన్నటువంటి ఒక ఓ.ఎస్ నీ 50 వేల డాలర్లకు కొన్ని అభివృద్ధి చేసి ఎమ్మెస్ దాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే పేరుతో ఐబీఎం కి ఇచ్చాడు.ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే మైక్రోసాఫ్ట్ మిలియన్ డాలర్ కంపెనీగా మారింది. 

మైక్రోసాఫ్ట్ కంపెనీ నడిపించడానికి బిల్ గేట్స్ తన చదువును మధ్యలోనే ఆపేశారు.

కొంతకాలం తర్వాత 1986లో మైక్రోసాఫ్ట్ విండోస్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చాడు మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే ఒక మైలురాయి.

విండోస్ సహాయంతో మన బిల్ గేట్స్ చాలా ఫేమస్ అయ్యాడు. 90% ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం మన మైక్రోసాఫ్ట్ చేతుల్లోనే ఉంది. బిల్ గేట్స్ కి 30 సంవత్సరాలు వచ్చే వరకు బిల్ గేట్స్ మిలియనీర్ అవ్వాలని కోరిక కానీ తనకు 30 ఇయర్స్ వచ్చేలోపే ఏకంగా బిలియనీర్ అయ్యారు.బిల్ గేట్స్ మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ తప్ప మరి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ను రాకుండా చేస్తున్నారు అని చాలా కంపెనీలు కోర్టుకు వెల్లాయి. కానీ బిల్ గేట్స్ భయపడలేదు కొత్తగా ఇంటర్నెట్ అనేది అప్పుడే మార్కెట్లోకి వస్తున్న రోజలవి.ఆ సమయంలో Internet explorer అనే పేరుతో search engine ని స్టార్ట్ చేశారు.

ఇలా ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనతో మైక్రోస్కోప్ ని పరుగులు పెట్టించాడు.1994 లో మెలిండా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

బిల్ గేట్స్ జీవితంలో డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే మంచి పనులు చేయడం ఇంకో ఎత్తు.బిల్ గేట్స్ బిల్ మరియు మెలిండా గేట్స్ అనే ఫౌండేషన్ ని స్టార్ట్ చేశారు.ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం,ఆరోగ్యం,విద్య ఇంకా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారు.దీనికోసం తన ఆస్తిలో 28 బిలియన్ డాలర్లు లక్షా ఎనభై వేల కోట్ల కంటే ఎక్కువ దానం చేశాడు.ఎన్నో దేశాల్లో నిరుపేదల పిల్లలకు టీకాలు వేయడం 50 లక్షల మంది పిల్లల కంటే ఎక్కువ మంది ప్రాణాలు కాపాడాడు.

వారసత్వంగా వచ్చిన ఆస్తి తో పిల్లలు ఏ కష్టం పడకుండా హాయిగా బ్రతకాలి అని తల్లిదండ్రులు అనుకుంటారు.కానీ బిల్ గేట్స్ అలా కాదు తమ పిల్లలను తమ కాళ్ళ మీద నిలబడాలని ప్రతి ఒక్కరికి 10 మిలియన్ డాలర్లు మాత్రమే ఇచ్చాడు.తన మిగతా ఆస్తి చాలా ఫౌండేషన్ కి రాసిచ్చాడు.బిల్ గేట్స్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కానీ బిల్ గేట్స్ మధ్యతరగతి వారు లాగే ఉంటాడు.బిల్ గేట్స్ ఎక్కువగా సేవా కార్యక్రమాల మీద పేదవారికి సహాయం చేయడం మీద దృష్టి పెడతారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు